: మోదీ కన్ను 64 వేల కోట్లపై


ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనలో 20 వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకోనున్నారు. తద్వారా 64 వేల కోట్ల రూపాయలు సమకూర్చుకునే దిశగా ఆయన అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం చైనాలో అడుగు పెట్టిన మోదీ, ఆ దేశాధ్యక్షుడు జీ జిన్ పింగ్ స్వస్థలం జియాన్ చేరుకున్నారు. పురాతన నగరంగా పేరున్న జియాన్ లో జింగ్ షాన్ ఆలయాన్ని సందర్శించారు. టెర్రకోట యుద్ధ వీరుల మ్యూజియం కూడా సందర్శించారు. ప్రముఖ బౌద్ధ క్షేత్రం గోల్డెన్ టెంపుల్ ను సందర్శించిన మోదీ, బౌద్ధ భిక్షువులతో ప్రార్థనలు చేశారు. ఈ విశేషాలను ఆయన ట్విట్లర్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News