: సీబీఐ మాజీ డైరెక్టర్ పై విచారణ జరిపించండి: సుప్రీం ఆదేశం
సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు కష్టాలు తప్పేలా లేవు. గతంలో రంజిత్ సిన్హా తన నివాసంలో... కుంభకోణాలలో ఆరోపణలు ఉన్నవారిని కలుసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో, రంజిత్ సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో, సిన్హాపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చే విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ఎవరితో విచారణ జరిపించాలి? ఏ తరహాలో విచారణ జరిపించాలి? అన్న నిర్ణయాన్ని మాత్రం విజిలెన్స్ కమిషన్ కే వదిలేసింది.