: ఇలాంటి దుర్మార్గాలను పెకిలించి వేయాలి: ప్రధాని


దేశంలో మహిళల భద్రత, రక్షణ చాలా ఆందోళనకరమైన అంశాలుగా పరిణమించాయని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన పైశాచిక దాడి నేపథ్యంలో ప్రధాని తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇలాంటి దుర్మార్గాలను సమాజం నుంచి కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉందన్నారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు స్పందించిన తీరును కూడా ప్రధాని తప్పుబట్టారు. ప్రజాందోళనను అర్థం చేసుకుని జాగ్రత్తగా వ్యహరించాలని సూచించారు. మహిళలపై దాడులను అరికట్టేందుకు బలమైన చట్టం తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం వేగంగా వ్యవహరించిందని చెప్పారు.

  • Loading...

More Telugu News