: 'విశ్వరూపం'కు తొలగని అడ్డంకులు
'విశ్వరూపం' సినిమా విడుదలపై సస్పెన్స్ వీడడం లేదు. తమిళనాడులో ఈ చిత్రం విడుదలపై ముస్లిం సంఘాలతో కమల్ సోదరుడు చంద్రహాసన్ జరిపిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదల కోసం ముంబై వెళ్లిన కమల్ హాసన్ తిరిగి వచ్చాక ఆయనతోనే చర్చిస్తామని ముస్లిం సంఘాలు తేల్చి చెప్పాయి. మరోవైపు 'విశ్వరూపం'పై ఫిబ్రవరి 4న తమిళనాడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఫిబ్రవరి 6న హైకోర్టు తీర్పు వెలువరించనుంది.