: వెంగళరావు పార్కులో టీ మంత్రులు హరీశ్, నాయిని...చెరువు పునర్నిర్మాణంపై సమీక్ష


తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావులు నేటి ఉదయమే వెంగళరావు పార్కులో ప్రత్యక్షమయ్యారు. మార్నింగ్ వాక్ కోసం కాదట. పార్కులో చెరువు పునర్నిర్మాణ పనులను పరిశీలించేందుకట! ఉదయమే కదా హరీశ్ రావు చక్కగా టీషర్టులో రాగా, నాయిని మాత్రం తన సాధారణ వస్త్రధారణలోనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. మంత్రుల రాకపై ముందుగానే సమాచారం ఉన్న అధికారులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. పార్కులో చెరువు పునర్నిర్మాణ పనులు చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించిన మంత్రులు, పనులను తక్షణమే మొదలుపెట్టాలని అధికారులకు ఆర్డరేసి అక్కడి నుంచి వెళ్లారు.

  • Loading...

More Telugu News