: చైనా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ


భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం చైనా చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన చైనా నగరం జియాన్ లో ల్యాండయ్యారు. మోదీ రాక కోసం వేచి చూస్తున్న చైనా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేటి నుంచి మూడు రోజుల పాటు నరేంద్ర మోదీ చైనాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయి. ఈ మేరకు నరేంద్ర మోదీ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే అక్కడికి వెళ్లారు.

  • Loading...

More Telugu News