: నేనే పిల్లాడ్ని...అప్పుడే పిల్లలు ఏంటి?: రాంచరణ్


'నన్ను నేనే చిన్న పిల్లాడిలా భావిస్తుంటాను. అలాంటిది నాకు అప్పుడే పిల్లలు ఏంటి?' అంటూ రాంచరణ్ మీడియాను నవ్వించాడు. ఓ ఫిట్ నెస్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రాంచరణ్ హైదరాబాదులో దాని బ్రాంచ్ ఓపెనింగ్ కు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన తండ్రి 150వ సినిమా గురించి మాట్లాడుతూ, భారీ బడ్జెట్ సినిమా అని అన్నాడు. మెగాస్టార్ చిరంజీవితో నిర్మించే సినిమా బారీ బడ్జెట్టుది కాకుండా, చిన్న బడ్జెట్ సినిమా అవుతుందా? అంటూ ఎదురు ప్రశ్నించాడు. సినిమా కథ మాత్రమే ఫైనలైజ్ చేశానని, కథ అద్భుతంగా ఉందని, దర్శకుడుగా పూరీని నిర్ణయించామని, నటీ నటుల గురించి తన తండ్రితో చర్చిస్తున్నానని రాంచరణ్ తెలిపాడు. సినిమాను ఉన్నత విలువలతో నిర్మిస్తానని, తొలి సినిమా మెగాస్టార్ తో నిర్మించడం బాధ్యతను పెంచిందని అన్నాడు. సినీ నిర్మాతగా రంగ ప్రవేశం చేస్తున్న తనకు సినీ రంగం మొత్తం మద్దతు పలుకుతోందని రాంచరణ్ తెలిపాడు. పిల్లల గురించి ఇంకా ప్లాన్ చేసుకోలేదని, దానిపై ఆలోచించాలని రాంచరణ్ నవ్వుతూ చెప్పాడు.

  • Loading...

More Telugu News