: అదనపు స్వర్ణ పతకం కావాలంటున్నారు!


ఒలింపిక్ ఈవెంట్లో తమకు అదనంగా మరో స్వర్ణ పతకం కేటాయించాలని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) కోరుతోంది. ఈ మేరకు ఐటీటీఎఫ్ అధ్యక్షుడు థామస్ వీకెర్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చీఫ్ థామస్ బాక్ కు విజ్ఞప్తి చేశారు. ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో నాలుగు బంగారు పతకాలకు పోటీలు నిర్వహిస్తున్నారని, వాటికి అదనంగా మరో పసిడి పతకాన్ని కేటాయించాలని అన్నారు. ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ లో మిక్స్ డ్ డబుల్స్/మిక్స్ డ్ టీం అంశాన్ని కూడా ప్రవేశపెట్టాలని సూచించారు. ఒలింపిక్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో పురుషుల సింగిల్స్, పురుషుల టీం ఈవెంట్, మహిళల సింగిల్స్, మహిళల టీం ఈవెంట్ విభాగాల్లోనే పోటీలు నిర్వహిస్తున్నారు. వీటికి అదనంగా మిక్స్ డ్ డబుల్స్ అంశాన్ని గానీ, మిక్స్ డ్ టీం ఈవెంట్ ను కూడా చేర్చాలని వీకెర్ట్ కోరారు. దీనిపై ఐటీటీఎఫ్ ఓ ప్రకటన చేసింది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో అదనపు స్వర్ణ పతకం సాధ్యాసాధ్యాలపై బాక్ తో వీకెర్ట్ చర్చించారని ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News