: 'ఐఎస్ఐఎస్' డిప్యూటీ కూడా పోయాడట!
అంతులేని అరాచకాలతో ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు తాజాగా గట్టి ఎదురుదెబ్బతగిలింది. అమెరికా క్షిపణి దాడుల్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అలీ బాగ్దాదీ గతంలోనే మరణించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్థానాన్ని భర్తీ చేసిన అబూ అలా అఫ్రీ కూడా అమెరికా క్షిపణి దాడుల్లో మృతి చెందినట్టు భావిస్తున్నారు. అబూ అలా అఫ్రీ ఇరాక్ ఉత్తర ప్రాంతంలోగల టల్ అఫర్ పట్టణంలోని ఓ మసీదులో అనుచరులతో సమావేశమై ఉండగా, అమెరికా వైమానిక దళం బాంబుదాడులు చేసింది. ఈ దాడుల్లో అఫ్రీ మరణించి ఉంటాడని ఇరాక్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, అబూ బకర్, అలా అఫ్రీ మరణిస్తే ఐఎస్ఐఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే.