: మోదీకి 'నో' చెప్పిన సిద్ధరామయ్య!
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీ ఆఫర్ కు 'నో' చెప్పారు. తనతో కలసి చైనా రావాలంటూ మోదీ పంపిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. కర్ణాటకలో పంచాయతీ ఎన్నికల కారణంగా ప్రధానితో చైనా పర్యటనకు వెళ్లలేకపోతున్నానని అన్నారు. అయినా, ప్రధాని నుంచి ఆహ్వానం ఆలస్యంగా అందిందని అన్నారు. ఇంతకుముందు కూడా ఓసారి సిద్ధరామయ్య ప్రధానికి 'నో' చెప్పారు. స్వచ్ఛ భారత్ అభియాన్ టాస్క్ ఫోర్స్ కు కన్వీనర్ గా ఉండాలని మోదీ... సిద్ధరామయ్యను కోరారు. అయితే, ఈ కర్ణాటక సీఎం మాత్రం తాను సభ్యుడిగానే ఉంటానని సున్నితంగా బదులిచ్చారు.