: ధూమపాన ప్రియులు ఇప్పుడు వంద కోట్ల మంది!


'పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్' అన్న గిరీశం మహాశయుడి మాటలు బాగా నాటుకుపోయాయేమో, ధూమపానానికి ఎక్కువగా ఆకర్షితులైపోతున్నారు. 'ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ప్రతి సినిమాలోనూ, సీరియల్ లోనూ 'ధూమపానం కేన్సర్ కారకం' అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ ఈ వ్యసనాన్ని అరికట్టలేకపోతున్నారు. దిగ్బ్రాంతికి గురి చేసే అంశం ఏంటంటే, వంద కోట్ల మంది ప్రజలు ధూమపాన ప్రియులుగా మారారట! ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు పొగతాగుతున్నారని ఓ సర్వే వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 5 శాతం మంది మద్యానికి బానిసలైతే, 20 శాతం మంది పొగాకుకు బానిసలయ్యారని సర్వే వెల్లడించింది. మనిషి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలను ప్రపంచ వ్యాప్తంగా 15 మిలియన్ల మంది తీసుకుంటున్నారని సర్వే వెల్లడించింది.

  • Loading...

More Telugu News