: ప్రతి మాటలో విషం... ప్రతి ఆలోచనలో ఈర్ష్య... 'బాహుబలి' కొత్త పోస్టర్ విడుదల చేసిన రాజమౌళి


టాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన బాహుబలి ప్రచారంలో దర్శకుడు రాజమౌళి వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బాహుబలి ఇంట్రో, ప్రభాస్, అనుష్క, ప్రభాకర్, రమ్యకృష్ణల పోస్టర్లను విడుదల చేసిన రాజమౌళి తాజాగా నాజర్ పోస్టర్ ను విడుదల చేశారు. నాజర్ ఈ సినిమాలో 'బిజ్జలదేవ' పాత్ర పోషించాడని రాజమౌళి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. "ప్రతి మాటలో విషం... అడుగడుగునా క్రౌర్యం, ప్రతి ఆలోచనలో ఈర్ష్య"... అంటూ బిజ్జలదేవ స్వభావాన్ని వివరించే ప్రయత్నం చేశారు. తమిళ వెర్షన్లో నాజర్ పోషించిన పాత్ర పేరు 'పింగళదేవన్' అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News