: ఎస్ఐ ను ట్రాన్స్ ఫర్ చేయాలని నేను కోరలేదు: మంత్రి గంటా వర్గం ఎమ్మెల్యే


తనపై వచ్చిన ఆరోపణలను మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గానికి చెందిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఖండిస్తున్నారు. తప్పుచేస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమని తెలిపారు. ఎస్ఐ ట్రాన్స్ ఫర్ ను తాను కోరలేదని విశాఖలో ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటుచేసి చెప్పారు. మైనింగ్ లీజు విషయంలో ఎమ్మార్వోను అడిగే హక్కు ఎస్ఐకి ఉందా? అని మాత్రమే ఎస్పీని అడిగానని, దానికి తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అమ్మవారి జాతర విషయంలో ఎస్పీ సహకరించడం లేదనే డీజీపీని కలిశానన్న ఎమ్మెల్యే, తనకు, మాజీ ఎమ్మెల్యేలకు ఎలాంటి లావాదేవీలు లేవని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News