: డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్ తో అతను కంటిని కోల్పోయాడు!


క్రికెట్ లో ఈ మధ్య ప్రమాదాలు ఎక్కువయ్యాయి. తాజాగా, ఐపీఎల్ లో ఈ నెల 9న కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఓ బంతిని స్టాండ్స్ లోకి పంపగా, ఆ బంతి జి బ్లాక్ లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న అలోక్ (57) అనే పోలీస్ డ్రైవర్ ను గాయపరిచింది. బంతి కంటికి తగలడంతో బాధతో విలవిల్లాడుతూ అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, దెబ్బ తగిలిన కన్నును కోల్పోక తప్పలేదు. ఆ కంటి చూపును పునరుద్ధరించేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు. ఈ ఘటనతో పోలీస్ వర్గాలు విచారంలో మునిగిపోయాయి. అలోక్ కోల్ కతా ఐదో బెటాలియన్ డీఎస్పీ వాహనానికి డ్రైవర్ గా వ్యవహరిస్తున్నాడు.

  • Loading...

More Telugu News