: రెండు రోజుల తరువాత పెరిగిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు పది గ్రాములకు రూ.315 పెరిగింది. దాంతో పది గ్రాముల బంగారం ధర రూ.27,565కు చేరింది. అటు వెండి ధర రూ.700 పెరగడంతో కేజీ వెండి ధర రూ.38,500 పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతోనే డిమాండ్ పెరిగిందని, ఈ క్రమంలో కొనుగోళ్లు పెరిగి ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ప్రతిసారీ బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గడం, పెరగడం చూస్తున్న సంగతి తెలిసిందే.