: 'పర్యావరణ పాపులు' దేవుడికి సమాధానం చెప్పుకోవాలి: పోప్


ప్రపంచం పర్యావరణ కాలుష్యం కోరల్లో చిక్కుకుపోవడం పట్ల పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వెలిబుచ్చారు. కారిటాస్ క్యాథలిక్ చారిటబుల్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ... 'భూమిపై ఉన్న శక్తిమంతులు' (అగ్రరాజ్యాలు) పర్యావరణాన్ని కాపాడడంలో విఫలమైతే వారు దేవుడికి సమాధానం చెప్పుకోవాలని అన్నారు. అలాంటి శక్తులను ఆయన 'పర్యావరణ పాపులు'గా అభివర్ణించారు. భూమండలంపై అందరికీ తగినంత ఆహారం ఉందని అన్నారు. అయితే, దాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవాలన్న ఉద్దేశమే కొరవడిందని అభిప్రాయపడ్డారు. "మనం చేయగలిగిన పనిని తప్పక చేయాలి. తద్వారా ప్రతి ఒక్కరికీ తిండి లభిస్తుంది. అయితే, భూమండలంపై శక్తిమంతులు గమనించాల్సింది ఏమిటంటే, ఏదో ఒకనాడు వారిని దేవుడు పిలుస్తాడు. వారు ప్రతి ఒక్కరికి తిండి కోసం నిజంగా కష్టపడ్డారా? లేదా?... పర్యావరణం కోసం చేయగలిగిందంతా చేశారా? లేదా? అన్నది ఆ రోజు తేలిపోతుంది" అని అన్నారు. పోప్ గతంలోనూ పర్యావరణ పరిరక్షణపై పలు అంతర్జాతీయ వేదికల మీద ఎలుగెత్తారు.

  • Loading...

More Telugu News