: కార్మికుల కోర్కెలు తీర్చాం...సమ్మె విరమించారు: అచ్చెన్నాయుడు


ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల కోర్కెలు తీర్చామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్మిక సంఘాల సహకారం మరువలేనిదని అన్నారు. 43 శాతం ఫిట్ మెంట్ కు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన తెలిపారు. అలాగే పాత బకాయిలు రిటైర్మెంట్ సందర్భంగా తీరుస్తామని చెప్పారు. కార్మిక సంఘాల నేతల డిమాండ్లు ఇప్పటికిప్పుడు తీరిస్తే రాష్ట్ర ప్రభుత్వం అడుక్కోవడానికి వెళ్ళాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అందుకే రిటైర్మెంట్ సమయంలో బకాయిలు చెల్లిస్తామని, ఈ సమస్య కేవలం ఫిట్ మెంట్ దే కాదని, దానితో ముడిపడిన చాలా అంశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు రోడ్లపై తిరుగుతాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News