: ఏపీలో ముగిసిన ఆర్టీసీ సమ్మె... విధుల్లో చేరాలని పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు


గత ఎనిమిది రోజులుగా కొనసాగిన ఆర్టీసీ సమ్మె ముగిసింది. తాము డిమాండ్ చేసిన 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకుందని కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ మేరకు మంత్రి వర్గ ఉపసంఘంతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని వెల్లడించాయి. దీంతో సమ్మె ముగిసిందని... వెంటనే కార్మికులంతా విధుల్లో చేరాలని పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా, తమ డిమాండ్లకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కార్మిక సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, చర్చలు ఫలవంతమయ్యేలా సహకరించిన మంత్రివర్గ ఉపసంఘానికి కూడా ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News