: రేపటి ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధం: టీఎస్ మంత్రి కడియం
తెలంగాణలో రేపు జరగనున్న ఎంసెట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఒకవేళ విద్యార్థులు పొరపాటున వేరే కేంద్రానికి వెళ్లినా... వారు పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. అయితే, నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించమని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో, విద్యార్థుల తరలింపుకు ప్రైవేటు వాహనాలను సిద్ధం చేశామని తెలిపారు.