: ఆ ఉగ్రవాదులు పోలీస్ యూనిఫాంలో వచ్చి...కాల్పులకు తెగబడ్డారు
పాకిస్థాన్ లో ఈ ఉదయం షియా వర్గానికి చెందిన ముస్లింలు ప్రయాణిస్తున్న బస్సుపై తెహ్రీక్ ఎ తాలిబాన్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 47 మందిని హతమార్చిన ఘటనలో మరో అంశం వెలుగు చూసింది. పోలీస్ యూనిఫాంలో ఉగ్రవాదులు బస్సును అటకాయించడంతో కంగారుపడ్డ డ్రైవర్ బస్సును ఆపాడట. ఆ వెంటనే, బస్సు తూట్లు పడేలా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు పోలీసులకు తెలిపాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఎక్కువ మంది కూలీలు, రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు చేసుకునే అసంఘటిత కార్మికులేనని పోలీసులు వెల్లడించారు. ఉచిత బస్సులో కరాచీ వెళ్తుండగా, ఈ దారుణం చోటుచేసుకుంది.