: ఏపీ ప్రభుత్వం, కేబినెట్ మంత్రులపై ధర్మాన విమర్శలు


ఏపీ ప్రభుత్వం, కేబినెట్ మంత్రులపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తీవ్ర విమర్శలు చేశారు. మంత్రులు భజన బృందంగా మారారని, వాస్తవాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. సంవత్సరకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరాశ, నిస్పృహలలో ఉన్నారన్నారు. డ్వాక్రా వ్యవస్థను కుప్ప కూల్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని ధర్మాన ఆరోపించారు. రుణమాఫీ చేస్తామన్న అబద్ధపు వాగ్దానంతో లక్షలాది డ్వాక్రా సంఘాలు మూలపడ్డాయని పేర్కొన్నారు. 'ఇక రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు, బాగానే వుంది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు తీసుకువచ్చారా?' అని ధర్మాన వ్యంగ్యంగా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News