: 'ఆంధ్రజ్యోతి'పై ఫైర్ అయిన టీఎస్ మంత్రి


ఏబీఎస్ న్యూస్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణపై టీఎస్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులపై రోజుకో రీతిలో అసత్యాలు ప్రచారం చేయడాన్ని రాధాకృష్ణ మానుకోవాలని అన్నారు. నిర్మల్ లో తన కుటుంబ సభ్యులు వ్యాపారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని, చెరువులను ఆక్రమించుకుంటున్నారని అంటూ పిచ్చిరాతలు రాస్తున్నారని మండిపడ్డారు. తాము అక్రమాలు చేస్తున్నట్టు నిరూపిస్తే, తన ఆస్తులన్నీ ఆంధ్రజ్యోతికి రాసిస్తానని సవాల్ విసిరారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోందని... అందుకే టీఆర్ఎస్ పై నిత్యం బురదజల్లే కార్యక్రమం చేపట్టిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News