: వ్యక్తిగత ఫిట్ నెస్ ఫ్రెండ్ గా జియోమీ ఎంఐ బ్యాండ్... ధర రూ. 999


చైనా యాపిల్ గా పేరున్న జియోమీ మరో వినూత్న ప్రొడక్టును మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంఐ బ్యాండ్ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఇది చేతికి తగిలించుకునే చిన్న బ్యాండ్ మాదిరిగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ను బ్లూటూత్ సాయంతో దీనికి అనుసంధానం చేసుకోవచ్చు. ఆపై ఈ బ్యాండ్ మీకు ఫిట్ నెస్ సలహాలు, సూచనలు అందిస్తుంది. రోజుకు ఎన్ని అడుగులు నడిచాము? ఎంత కేలరీల శక్తి ఖర్చయింది? వంటి విషయాలను ఎప్పటికప్పుడు ఇది తెలుపుతుంది. పల్స్ రేట్ ను పరిశీలిస్తూ విలువైన సూచనలు ఇస్తుంది. రిమూవబుల్, వాటర్ ప్రూఫ్ బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ స్మాల్ గాడ్జెట్ ఒకసారి చార్జింగ్ తో 20 నుంచి 30 రోజుల పాటు పనిచేస్తుందట. ధర రూ. 999 మాత్రమేనని జియోమీ ప్రకటించింది. ఇండియాలోని స్మార్ట్ ఫోన్ వాడకందారులందరినీ ఈ ఎంఐ బ్యాండ్ ఆకర్షిస్తుందని జియోమీ నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News