: బాధిత రైతుల కుటుంబాలకు రాహుల్ ఆర్థిక సాయం... పాదయాత్ర షెడ్యూల్ ఖరారు


తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టనున్న రైతు భరోసా యాత్రకు సంబంధించిన సీడీ, పోస్టర్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈ సందర్శంగా ఆయన మాట్లాడుతూ, రైతు భరోసా యాత్రలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రాహుల్ గాంధీ ఆర్థిక సహాయం చేస్తారని చెప్పారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతుల నుంచి రాహుల్ గాంధీ వినతులు స్వీకరిస్తారన్నారు. హైదరాబాదు మీదుగా నిర్మల్ వెళ్లి, తిరిగి హైదరాబాదు మీదుగానే రాహుల్ గాంధీ ఢిల్లీ వెళ్లనున్నా నగరంలో ఎలాంటి రోడ్ షో ఉండదని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాదు చేరుకోనున్న రాహుల్ గాంధీ శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో రైతులు, పీసీసీ నేతలతో కాసేపు భేటీ అవుతారు. ఆ తర్వాత శంషాబాదు, పంజాగుట్ట, బోయిన్ పల్లి, మేడ్చల్ మీదుగా నిర్మల్ వెళతారు. నిర్మల్ లో హోటల్ మయూర ఇన్ లో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం 7 గంటలకు నిర్మల్ నుంచి బయలుదేరనున్న రాహుల్... కొరటికల్, లక్ష్మణ చాందా, పొట్టుపల్లి, రాచాపూర్, వాడియాల్ గ్రామాల్లో పర్యటిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు నిర్మల్ లో బయలుదేరి హైదరాబాదు చేరుకుంటారు. రాత్రి 8 గంలకు శంషాబాదు ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు.

  • Loading...

More Telugu News