: బీహార్ లో 17కు పెరిగిన మృతుల సంఖ్య, మరింతమందికి గాయాలు


రెండుసార్లు భూకంపం, ఆ తరువాత 27సార్లు వచ్చిన భూప్రకంపనలతో బీహార్ లో పలువురు మరణించారు. ఇప్పటివరకు అక్కడ 17 మంది చనిపోగా, 77 మందికి గాయాలైనట్టు ఆ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం తెలిపింది. ప్రస్తుతం వారందరూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పింది. ముఖ్యంగా భూకంపంతో పాట్నా, ఈస్ట్ చంపారన్ జిల్లాలు బాగా దెబ్బతిన్నాయని, ఒక్కో జిల్లాకు ముగ్గురేసి చొప్పున మృతి చెందారని అధికారులు తెలిపారు. మాధేపురా, పుర్నియా, దర్భంగాలో ఇద్దరు చొప్పున చనిపోయారని వివరించారు. సీతమర్హీ, వైశాలి, సివాన్, శిఖ్ పురా జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పలు భవనాలు కూలిపోయాయని తెలిపారు. భూకంపం వల్ల బీహార్ లోని జిల్లాలన్నింటిలో భవనాలు, మౌలిక సదుపాయాల నష్టాన్ని ప్రస్తుతం అంచనా వేస్తున్నామని, త్వరలో పూర్తి నివేదిక అందిస్తామని ప్రత్యేక అధికారి విపిన్ కుమార్ రాయ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News