: 21వ శతాబ్దం ఆసియాదే!: చైనా మీడియాతో ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుంచి తన మూడు దేశాల పర్యటనను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ముందుగా తన పర్యటనను చైనాతో మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఆ దేశ మీడియా ప్రతినిధులకు మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. న్యూఢిల్లీ, బీజింగ్ ల మధ్య సంబంధాలపై ఈ సందర్భంగా ప్రధాని ప్రముఖంగా మాట్లాడారు. 21వ శతాబ్దం ఆసియాదేనని, ఈ నేపథ్యంలో చైనా పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం వున్నప్పటికీ, రెండు దేశాలూ శాంతి, స్నేహాన్ని తప్పక ప్రచారం చేయాలన్నారు. తన చైనా పర్యటన ఇరుదేశాల మైత్రి విషయంలో ఓ మైలురాయిని నెలకొల్పుతుందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు సాయం చేయడంలో భారత్, చైనాలు బాధ్యత వహించాలని ప్రధాని అభిప్రాయపడ్డారు.