: ఆశారాం బాపూ కుమారుడి లైంగిక వేధింపుల కేసులో ముఖ్య సాక్షిపై కాల్పులు


వివిదాస్పద గురు ఆశారాం బాపూ కుమారుడు నారాయణ శాయిపై కోర్టు విచారణలో ఉన్న లైంగిక వేధింపుల దాడి కేసులో ముఖ్య సాక్షిపై కాల్పులు జరగడం కలకలం రేపింది. ఆశారాం కేసులో సాక్షిగా ఉన్న మహేంద్ర చావ్లాపై ఈ ఉదయం కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు వివరించారు. ఈ ఘటనలో చావ్లా తీవ్రంగా గాయపడగా, ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చావ్లా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆశారాం, ఆయన కుమారుడిపై ఉన్న కేసుల్లో సాక్షులుగా ఉన్నవారిపై దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆశారాంపై ఉన్న అత్యాచారం కేసు నిందితుడిపై కోర్టు ఆవరణలోనే దాడి జరిగింది. మరో కేసులో ఇద్దరు కీలక సాక్షులు హత్యకు గురయ్యారు. ఓ మైనరుపై అత్యాచారం జరిపిన కేసులో సెప్టెంబర్ 2013 నుంచి ఆశారాం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News