: కోర్టు తీర్పుకు భయపడేది లేదు...ఎంతమందిని జైల్లో పెడతారో పెట్టుకోండి: ఆర్టీసీ కార్మిక సంఘాలు


న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న తాము హైకోర్టు తీర్పుకు భయపడేది లేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. సమ్మె విరమించాలన్న తన ఆదేశాలను పాటించని కార్మికులు కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టేనన్న హైకోర్టు, అరెస్టులకూ వెనుకాడబోమని కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాక కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై స్పందించిన కార్మిక సంఘాల నేతలు... తీర్పులకు భయపడేది లేదని ప్రకటించారు. ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండని కూడా బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో ఆర్టీసీ కార్మికులు జరుపుతున్న చర్చలు ఫలప్రదమైతే ఫరవాలేదు కానీ, విఫలమైతే మాత్రం సమ్మె మరింత ఉద్ధృతమయ్యే ప్రమాదం లేకపోలేదు. అంతేకాక కోర్టు ఆదేశాలతో ప్రభుత్వాలు కూడా కార్మకులపై కఠినంగానే వ్యవహరించే అవకాశాలూ లేకపోలేదు.

  • Loading...

More Telugu News