: కార్మిక సంఘాల నేతలతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం చర్చలు
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరుపుతోంది. ఏపీ సచివాలయంలో రవాణా మంత్రి శిద్దా రాఘవరావు కార్యాలయంలో జరుగుతున్న ఈ చర్చల్లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు అచ్చెన్నాయుడు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కార్మికులు పట్టుబడుతుండగా అంత ఇవ్వలేమని, ప్రయాణికులపై భారం పడుతుందని ప్రభుత్వం అంటోంది. అయితే 30 నుంచి 40 వరకు ఫిట్ మెంట్ ఇచ్చే యోచనలో ఆర్టీసీ ఉన్నట్టు తెలుస్తోంది. నేటితో ఆర్టీసీ సమ్మె 8వ రోజుకు చేరింది.