: 'సహచరుడి'ని పెళ్లాడుబోతున్న లక్సెంబర్గ్ ప్రధాని


ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా 'గే' వివాహాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది ఈ విషయంపై బహిరంగంగా చెబుతుంటే, మరికొంత మంది మాత్రం గుట్టుగా ఉంటున్నారు. కానీ పశ్చిమ యూరప్ దేశం లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెటెల్ మాత్రం ఈ విషయంలో పూర్తి బహిరంగంగా ఉన్నారు. స్వలింగసంపర్కుడైన ఆయన గత ఆరేళ్ల నుంచి తన సహచరుడైన గోథియర్ తో సహజీవనం చేస్తున్నారు. 2013లో ప్రధాని అయిన జేవియర్ దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. జూన్ నెలలో వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు జేవియర్ కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. లక్సెంబర్గ్ లోని డచ్ చర్చిలో పెళ్లి జరగనుందట. గే అయిన ఓ వ్యక్తి ప్రధాని హోదాలో ఉండి పెళ్లి చేసుకోబోవడం ఇదే ప్రథమం. దాంతో ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొందట. ఈ పెళ్లి వేడుకను ప్రత్యేకంగా ప్రచురిస్తామని ప్రముఖ మ్యాగజైన్లు ముందుకు రాగా ప్రధాని జేవియర్ సున్నితంగా తిరస్కరించారట. ఇది తన వ్యక్తిగత విషయమని అన్నారట. ప్రధాని అయ్యాక జేవియర్ తమ దేశంలో ఎల్జీబీటీల (లెస్బియాన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్) హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టి, తరువాత గే మ్యారేజ్ ను చట్టబద్ధం చేశారు.

  • Loading...

More Telugu News