: లక్షల కట్నం తీసుకుని పెళ్లికి ముందే వరుడు జంప్ ... వధువు ఆత్మహత్యాయత్నం!


ఈ దారుణ ఘటన హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, నవదీప్ రాజు అనే యువకుడికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. ఒప్పందం ప్రకారం, వధువు తల్లిదండ్రులు ముందుగానే రూ. 10 లక్షల కట్నం కూడా ముట్టజెప్పారు. అయితే, ఈ కట్నం తనకు సరిపోదని, మరింత కట్నం కావాలని నవదీప్ డిమాండ్ చేశాడు. అంతే కాదు, ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో, తీవ్ర మనస్తాపానికి గురైన వధువు ఆత్మహత్యా యత్నం చేసింది. దీంతో, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News