: నేపాల్ లో దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ కు తప్పిన ముప్పు


టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ నేపాల్ లో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. నిన్న నేపాల్ లో సంభవించిన భూకంపం సందర్భంగా ఆయన ఉన్న ప్రాంతంపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో వెనువెంటనే అప్రమత్తమైన ఆయన బండరాళ్లను తప్పించుకుని క్షణాల్లో సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. వివరాల్లోకెళితే... ఇటీవల నేపాల్ ను నేలమట్టం చేసిన భూకంపం నేపథ్యంలో అక్కడ సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు దేవేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరేందర్ తో పాటు ఓ బృందం అక్కడికి వెళ్లింది. నిన్న భూకంపం సంభవించిన సమయంలో నేపాల్ లోని భరించి గ్రామంలో వీరేందర్ బృందం బాధితులకు ఆహారాన్ని సరఫరా చేస్తోంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో సమీపంలోని కొండచరియలు విరిగి గ్రామంపై పడ్డాయి. దీంతో వీరేందర్ బృందం సభ్యులు చెల్లాచెదురయ్యారు. అయితే క్షణాల్లో తేరుకున్న వీరేందర్ కొండచరియల బారి నుంచి తప్పించుకుని సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News