: తుంగభద్రలో ఎర్రచందనం దుంగలు... కర్నూలు జిల్లాలో పది మంది స్మగ్లర్ల అరెస్ట్


ఎర్రచందనం అక్రమ రవాణాకు ఏపీలో అడ్డుకట్ట పడటం లేదు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా, అక్కడ పోలీసుల నిఘా పెరగడంతో స్మగ్లర్లు కర్నూలు జిల్లా వైపు దృష్టి సారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న తుంగభద్ర నది ఒడ్డున తనిఖీలు చేసిన పోలీసులు పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఇసుక గుంతల్లో స్మగ్లర్లు వందకు పైగా ఎర్రచందనం దుంగలను దాచారు. దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి, పది మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరిలో ఎనిమిది మంది కర్నూలు జిల్లా వాసులు కాగా, ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన వారని పోలీసులు తేల్చారు.

  • Loading...

More Telugu News