: ఆంధ్రప్రదేశ్ కొత్త పర్యాటక పాలసీ ఇదే...


సరికొత్త పర్యాటక విధానానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఆమోద ముద్రవేసింది. ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశం నిర్ణయాలను మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. 2020 నాటికి పర్యాటక రంగంలో పది వేల కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా నూతన విధానం ఖరారు చేశారు. ఈ విధానంలో భాగంగా పర్యాటక ప్రాజెక్టులకు 33 ఏళ్ల పాటు భూములను లీజుకు ఇవ్వనున్నారు. అలాగే పర్యాటక రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నారు. నూతన మత్స్య విధానానికి ఆమోద ముద్ర వేశారు. ఏపీ ప్రొక్యూర్ మెంట్ ఈ-పాలసీ ఫర్ గవర్నెన్స్ ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంస్కరణలు అమలు చేయాలని కంకణం కట్టారు. రాష్ట్రంలో అనువైన చోట కాఫీ తోటల పెంపకానికి పథకాలు సిద్ధం చేయనున్నారు. కాఫీ గింజలకు గిట్టుబాటు ధర కోసం చర్యలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన ఉద్యోగులను ఏపీకి తరలించేందుకు మంత్రి వర్గం ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News