: తిరుమల క్షేత్రంలో టీటీడీ చైర్మన్ తనిఖీలు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. తాను టీటీడీ చైర్మన్ గా ఎన్నికైనా, స్వామివారి భక్తుడిగానే సేవలందిస్తానని స్పష్టం చేశారు. తిరుమల క్షేత్రంలో ఆయన నేడు తనిఖీలు నిర్వహించారు. యాత్రీ సదన్, కల్యాణ కట్ట ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం జరుగుతున్న సమ్మె కారణంగా భక్తులు కొండపైకి చేరుకునేందుకు అవస్థ పడుతున్నారని తెలిపారు. అందుకే, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తిరుమలకు బస్సులు నడిపేలా వారికి నచ్చజెబుతానని తెలిపారు.