: బాలీవుడ్ ను తాకిన భూ'ప్రకంపనలు'!


నేపాల్ లో 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపం పలువురు బాలీవుడ్ హీరోయిన్లను తాకింది. దీంతో వారంతా అదిరిపడ్డారు. వెంటనే తమ అనుభవాలను ట్విట్టర్లో ఏకరువుపెట్టారు. నేపాల్ భూకంపం భారత్ ను కుదిపేయడంతో 'ఉడ్ తా పంజాబ్' సినిమా షూటింగ్ కోసం అమృత్ సర్ లో ఉన్న షాహిద్ కపూర్ 'అమృత్ సర్ లో భారీ భూ ప్రకపంనలు వచ్చాయి' అని ట్వీటాడు. 'ఓ మై గాడ్! నేను పక్కకి తూలాను. ఇంతలో ఢిల్లీలో భూకంపం వచ్చిందని మెసేజ్ వచ్చింది...అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తా' అంటూ సోనాక్షి సిన్హా ట్వీట్ చేసింది. 'ముంబైలో మళ్లీ భూకంపం వచ్చింది' అంటూ పరిణీతి చోప్రా ట్వీట్ చేసింది. 'మళ్లీ నేపాలేనా? అయ్యో పాపం, మరోసారీ నేపాలేనా?' అంటూ తాప్సీ బాధపడింది. నేపాల్ ప్రజలకు దేవుడు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలంటూ బాలీవుడ్ నటీనటులు ట్విట్టర్లో కోరుకున్నారు.

  • Loading...

More Telugu News