: 'వెలుగు'లోకి వచ్చిన ఊబకాయం కారణాలు!
ఊబకాయం బారిన పడుతున్నట్టు అనిపిస్తోందా? అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నెదర్లాండ్స్ లోని లీడెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఊబకాయం బారిన పడటానికి కొన్ని కారణాలు వెల్లడించారు. వాటిల్లో నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ చేసే తప్పులు చాలా ఉన్నాయి. రాత్రి లైట్లు ఆర్పకుండా నిద్రిస్తే ఊబకాయం బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతే కాదు, టీవీ చూస్తూ పడుకున్నా ఊబకాయం సమస్య వచ్చిపడ్డట్టేనట. అంతెందుకు, మొబైల్ వాడుతూ పడుకున్నా ఊబకాయం సమస్య తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ లైట్స్ శరీరంలోని జీవ క్రియలకు అంతరాయం కలిగించి, కెలోరీలు ఖర్చు చేసే గోధుమ కొవ్వు కణాలను నిర్వీర్యం చేస్తాయని లీడెన్ పరిశోధకులు తెలిపారు. ఇకపై పడుకునే ముందు టీవీ, మొబైల్, లైట్లు కట్టేసి నిద్రిస్తే ఊబకాయం సమస్య నుంచి రక్షించబడ్డట్టే.