: 'స్వచ్ఛ హైదరాబాద్' సమావేశానికి ప్రజాప్రతినిధులకు కేసీఆర్ ఆహ్వానం
ఈ నెల 14న సచివాలయంలో జరగనున్న 'స్వచ్ఛ హైదరాబాద్' సమావేశానికి హైదరాబాద్ లోని ప్రజాప్రతినిధులందరినీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. వారిలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారు. సీఎం కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. మే 16 నుంచి ఈ కార్యక్రమం అధికారికంగా మొదలవనున్న నేపథ్యంలో ముందుగా వారితో చర్చించనున్నారు. 20వ తేదీ వరకు ఈ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం జరుగుతుంది. రాజకీయ పార్టీలన్నీ ఈ కార్యక్రమానికి సహకరించాలని అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ కోరారు.