: మోదీకి చైనా పత్రిక మార్గదర్శకాలు


మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. అయితే, మోదీ తమ దేశంలోకి అడుగుపెట్టకముందే అక్కడి మీడియా మార్గదర్శకాలు జారీచేసింది. మోదీ వివాదాస్పద సరిహద్దు ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సందర్శించరాదని చైనా ప్రముఖ దినపత్రిక 'ద గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టాలని సూచించింది. చైనాతో చర్చల నేపథ్యంలో పరపతి పెరుగుతున్నందున, స్వదేశంలోనూ ప్రతిష్ఠను ఇనుమడింపజేసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొంది. అయితే, సరిహద్దు విషయంలో చిన్నపాటి ట్రిక్కులకు తెరదీస్తున్నారని ఆరోపించింది. మోదీని దార్శనికుడిగా కంటే కార్యసాధకుడిగానే భావించవచ్చని 'ద గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. ఇక, భారత సర్కారు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు మద్దతు తెలపడాన్ని నిలిపివేయాలని, ఇండో-చైనా సంబంధాలకు టిబెట్ సమస్యను అడ్డంకిగా పేర్కొనడాన్ని కట్టిపెట్టాలని స్పష్టం చేసింది. మోదీ పర్యటన చైనా-ఇండియా సంబంధాలను మెరుగుపర్చగలదా? అంటూ శీర్షిక పెట్టి పైవిధంగా పేర్కొంది.

  • Loading...

More Telugu News