: నేపాల్ స్కూళ్లకు 15 రోజులు సెలవులు...తెరుచుకున్న విమానాశ్రయం


నేపాల్ లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఈ నెల 14న తెరుచుకోవాల్సిన పాఠశాలలు, మరో 15 రోజుల పాటు మూతపడనున్నాయి. గత నెల 25న వచ్చిన భూకంపం కారణంగా మూతపడిన స్కూళ్లకు ఈ నెల 14 వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. తాజాగా మరోసారి నేపాల్ ను భూకంపం తీవ్రంగా కుదిపేయడంతో ఈ సెలవులను పొడిగించారు. కాగా, భూకంపం కారణంగా మూతపడిన ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తిరిగి తెరిచారు. విమానాశ్రయం తెరుచుకున్న అనంతరం ఒక విమానం భారత్ కు, మరో విమానం చైనా బయలుదేరి వెళ్లాయని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News