: నేపాల్, భారత్ లలో పెరుగుతున్న భూకంప మృతుల సంఖ్య
నేపాల్, భారత్ లలో భూకంప మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. నేపాల్ లో ఇప్పటివరకు 19 మంది చనిపోగా, 981 మంది గాయాలపాలయ్యారని ఆ దేశ హోంశాఖ మంత్రి లక్ష్మీ ప్రసాద్ దకల్ ఓ ప్రకటనలో తెలిపారు. నేపాల్ లో రెండుసార్లు వచ్చిన భూకంపం తరువాత కూడా తీవ్ర ప్రకంపనలు వచ్చాయని చెప్పారు. ఉత్తర భారతం విషయానికి వస్తే భూకంప ప్రభావంతో బీహార్ లో 15 మంది, యూపీలో ఇద్దరు చనిపోయినట్టు తెలిసింది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.