: భూకంపం నేపథ్యంలో సుప్రీంకోర్టు బంద్
ఢిల్లీలో సంభవించిన భూప్రకంపనలతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కార్యాలయాల్లో ఉన్నవారు, పెద్ద నివాస భవనాల్లో నివసిస్తున్నవారు వెంటనే బయటకు వచ్చేశారు. ఈ క్రమంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా, ముందస్తు చర్యగా మెట్రో రైలు సేవలను నిలిపివేశారు. ఇదే ప్రభావం సుప్రీంకోర్టుపై కూడా పడింది. ప్రకంపనల నేపథ్యంలో, ఈనాటి విచారణలన్నింటినీ నిలిపివేశారు.