: ఖాట్మండూ విమానాశ్రయం మూసివేత
రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన భూకంపంతో నేపాల్ మరోసారి అతలాకుతలమైంది. రాజధాని ఖాట్మండూలో పలు భవనాలు నేలకూలాయి. అయితే, ఎన్ని భవనాలు కూలిపోయాయన్న సమాచారం ఇంకా తెలియరాలేదు. దీంతో, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటి వరకు నలుగురు చనిపోయినట్టు సమాచారం. ఈ సంఖ్య ఎంత వరకు పెరగుతుందన్న విషయాన్ని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. మరోవైపు, ఖాట్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.