: భయపడకండి... ప్రశాంతంగా ఉండండి!: ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ విన్నపం


ఈ మధ్యాహ్నం నేపాల్ లో సంభవించిన భూకంపం ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్, బంగ్లాదేశ్, చైనా, ఇండొనేషియాలపై కూడా ప్రభావాన్ని చూపించింది. ఈ క్రమంలో మన దేశంలోని పలు రాష్ట్రాల్లో చిన్నపాటి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని పలు పట్టణాల్లో కూడా ప్రకంపనలు ప్రజలను బెంబేలెత్తించాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో మెట్రో సేవలను ఆపివేశారు. సచివాలయాన్ని కూడా బంద్ చేశారు. ఢిల్లీ ప్రజలు భయాందోళనలకు గురవడంతో, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వారిలో ధైర్యాన్ని నూరిపోసేందుకు ప్రయత్నించారు. "దయచేసి భయపడకండి. ప్రశాంతంగా ఉండండి. భూకంప స్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. అధికారులంతా ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు" అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News