: ఏపీలో భూ ప్రకంపనలు... భయాందోళనల్లో ప్రజలు


ఉత్తర భారతంలో చోటుచేసుకున్న భూకంపం ప్రభావం ఏపీనీ తాకింది. ఏపీలోని విశాఖ, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భూమి కంపించింది. నేటి మధ్యాహ్నం సరిగ్గా 12.40 గంటలకు సంభవించిన ఈ భూకంపం కారణంగా రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, గొల్లపూడి, విజయవాడలోని భవానీపురం, విశాఖలోని మధురవాడ, పీఎం పాలెం తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఉన్నట్టుండి భూమి కంపించడంతో భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే, ఈ కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం.

  • Loading...

More Telugu News