: ఉత్తర భారతంలో భూకంపం... ఢిల్లీ, బెంగాల్, బీహార్ లో కంపించిన భూమి
నేపాల్ ను కుదిపేసిన భూకంపాలు నాడు భారతావనిని కూడా భయపెట్టాయి. బీహార్ లో పదుల సంఖ్యలో ప్రజలను పొట్టనబెట్టుకున్నాయి. ఇక భూమి శాంతించిందిలే అనుకుంటున్న తరుణంలో కొద్దిసేపటి క్రితం ఉత్తర భారతం మొత్తం మళ్లీ కంపించిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లలో భూకంపం సంభవించింది. నిమిషం పాటు కంపించిన భూమి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. భూకంపంతో ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా ఈ భూకంపం సంభవించినట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.9గా నమోదైనట్లు సమాచారం.