: బెంగాల్ లో విచారణ ఖైదీలు కోర్టుకెళ్లాల్సిన పనిలేదట!
కోర్టు విచారణ కోసం జైళ్లలోని విచారణ ఖైదీలను కోర్టులకు తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం పోలీసులకు కత్తి మీద సామే. వచ్చీపోయే దారిలో పోలీసులపై విరుచుకుపడుతున్న నేరగాళ్లు తప్పించుకుని పరారవుతున్నారు. ఈ తరహా ఇబ్బందులు బెంగాల్ పోలీసులకు ఇకపై ఎదురుకాబోవు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లోని విచారణ ఖైదీలను విచారించేందుకు జైళ్లలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు మమతా బెనర్జీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఈ తరహా ఏర్పాట్లు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ విచారణలను ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.