: కేసీఆర్ తో హరీశ్ రావు భేటీ... ఆర్టీసీ సమ్మెపై మామా అల్లుళ్ల మంతనాలు


ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఇప్పటికే రెండు రోజులుగా ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం నేడు సమ్మెను విరమింపజేసే దిశగా తుది దశ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీశ్ రావు, కేసీఆర్ తో కీలక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కార్మికుల డిమాండ్లు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితరాలపై కూలంకషంగా చర్చిస్తున్న మామా అల్లుళ్లు సమ్మెకు చెక్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News