: ఏపీకి ‘హోదా’ ఇవ్వాల్సిందే... పార్లమెంట్ లో గాంధీ విగ్రహం ఎదుట వైసీపీ నిరసన


ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిన్నటిదాకా కాంగ్రెస్ పోరు సాగిస్తే, తాజాగా ఆ బాధ్యతను వైసీపీ అందుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీకి చెందిన ఎంపీలు కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వం ప్రకటించిన మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడుతుందని వారు నినదించారు.

  • Loading...

More Telugu News