: బోయిగూడలో తెలంగాణ కలెక్టర్లు... డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలన
తెలంగాణలోని పది జిల్లాల కలెక్టర్లు నేటి ఉదయం హైదరాబాదు పరిధిలోని బోయిగూడ ఐడీహెచ్ కాలనీకి తరలివెళ్లారు. అక్కడ కొత్తగా నిర్మితమైన డబుల్ బెడ్ రూం ఇళ్లను వారు పరిశీలించారు. పేదలందరికీ ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అన్ని జిల్లాల్లో నిర్మాణాలను మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే కలెక్టర్లందరూ బోయిగూడకు తరలివచ్చినట్లు తెలుస్తోంది.